బిగ్ న్యూస్ : జగన్ నిర్ణయానికి జై కొట్టిన టీడీపీ కీలక నేత!

Friday, February 14th, 2020, 07:00:14 AM IST

ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే.అధికార పార్టీ వైసీపీ అలాగే ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీల నేతలు గత ఏడాది గడిచిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను చూసినప్పటి నుంచి ఒకరి మీద ఒకరు పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటూనే వస్తున్నారు.వైసీపీ తీసుకున్న ఏ నిర్ణయిన్ని అయినా సరే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పటి వరకు విమర్శిస్తూనే వచ్చారు.

కానీ ఇప్పుడు టీడీపీకు సంబంధించిన ఒక కీలక నేత తమ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తీసుకున్న నిర్ణయానికి జై కొట్టి ఆశ్చర్యపరిచారు.రాబోయే రోజుల్లో జరగనున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రచార గడువు తగ్గించడమే కాకుండా ఎలాంటి మద్యం కానీ ధన ప్రవాహాలు లేకుండా ఈ ఎన్నికలు సజావుగా జరగాలని జగన్ ఆదేశాలు జారీ చేసారని వైసీపీ శ్రేణులు చర్చించగా ఆ నిర్ణయానికి టీడీపీకు చెందిన జాతీయ పంచాయితీ ఛాంబర్ అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ స్వాగతిస్తున్నానని ఏకగ్రీవంగా జై కొట్టారు.

జగన్ తీసుకున్న ఈ నిర్ణయం హర్షణీయం అని అయితే ఈ ధన ప్రవాహం లేని విధానం కేవలం ఈ ఎన్నికలకు మాత్రమే పరిమితం కాకుండా ఎమ్మెల్యే మరియు ఎంపీ ఎన్నికల్లో కూడా ప్రతీ ఒక్కరూ తీసుకొస్తే బాగుంటుంది అని సూచించారు.మొత్తానికి మాత్రం చాలా రోజుల తర్వాత జగన్ తీసుకున్న ఓ నిర్ణయానికి సానుకూలంగా స్పంచించడం బహుశా మొదటిసారి అని చెప్పొచ్చు.