వైసీపీ నేతలకు జగనన్న జేబు కత్తెర పేరిట ప్రత్యేక పథకం

Friday, October 9th, 2020, 03:05:25 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై తెలుగు దేశం పార్టీ కీలక నేత కొమ్మారెడ్డి పట్టాభి రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలకి జగనన్న జేబు కత్తెర పేరిట ప్రత్యేక పథకాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చారు అని ఘాటు విమర్శలు చేశారు. మంత్రులు, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యే లు, ఇతర నాయకులు ఆ పథకం లబ్ది దారులు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు విచ్చల విడిగా దీన్ని ఉపయోగిస్తున్నారు అని పట్టాభి రామ్ ఆరోపించారు. అయితే ప్రజల జేబులు కత్తిరించి వాళ్ళ దగ్గర నుండి ప్రజా ధనాన్ని దోచుకోవడమే ఈ పథకం లక్ష్యం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ పథకం ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడం లో మంత్రి గుమనూరు జయరాం ముందంజ లో ఉన్నారు అని సంచలన ఆరోపణలు చేశారు. భూ కుంభకోణం ఆరోపణల వ్యవహారం లో జయరాం అడ్డంగా దొరికిపోయినా, ఆయన్ను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారో సమాధానం ఇవ్వాలి అని సూటిగా ప్రశ్నించారు. అయితే మంత్రి పై మీడియా సమక్షం లో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఏసీబీ కి ఫిర్యాదు చేసినా ఏం చర్యలు తీసుకున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టాభి చేసిన వ్యాఖ్యలకి వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.