జగన్ పై సంచలన ఆరోపణలు చేసిన టీడీపీ నేత!

Sunday, June 28th, 2020, 11:17:12 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ నేత పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత వ్యాపార సంస్థ కోసం జల చౌర్యానికి పాల్పడ్డారు అని సంచలన ఆరోపణలు చేశారు. అయితే సరస్వతి ఇండస్ట్రీస్ కి కేటాయించిన దాని కంటే ఎక్కువగానే నీటిని మళ్లిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. అందుకోసం జారీ చేసిన జీవో ను సైతం తప్పు బట్టారు. అది అక్రమం అని ఘాటు విమర్శలు చేశారు. అయితే అలా అక్రమం గా నీటిని కేటాయించదం పట్ల ధ్వజమెత్తారు. ఆ జీఓ ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.

అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ విషయం లో ప్రజలకు క్షమాపణ చెప్పాలని పట్టాభి డిమాండ్ చేశారు. ఈ సరస్వతి ఇండస్ట్రీస్ కోసం సీఎం జగన్ అడుగడుగునా అక్రమాలకు పాల్పడ్డారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ సంస్థకు ప్రతి ఏటా 0.036 టీఎంసిలు మాత్రమే నీటిని వినియోగించే అకాశముందన్నారు. అయితే ఇది పర్యావరణ శాఖ చెప్పింది అని స్పష్టం చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు రెండింతలు నీటిని మళ్లిస్తున్నారు అని ఆరోపించారు. అయితే ఈ వ్యవహారంలో రైతులకు నష్టం జరుగుతుంది అని, వారి పంతులు ఎండుతుంటే, మీరు నీటిని చౌర్యం చేస్తారా అని నిలదీశారు. మరి దీని పై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.