కుక్క తోక వంకర అంటూ విజయ సాయి రెడ్డి పై ఘాటు విమర్శలు!

Sunday, August 2nd, 2020, 10:20:59 PM IST

వైసీపీ కీలక నేత, ఎంపీ విజయ సాయి రెడ్డి కరోనా వైరస్ సోకి, తాజాగా కోలుకున్నారు. అయితే ట్విట్టర్ లో మళ్లీ తాజాగా వ్యాఖ్యలు చేయడం పట్ల తెలుగు దేశం పార్టీ నేత అయ్యన్న పాత్రుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ సాయి రెడ్డి తీరు ను ఎండగడుతూ ఘాటు విమర్శలు చేశారు. కుక్క తోక వంకర అని, తనకి కరోనా రాగానే జగన్ రెడ్డి వైద్యం పై నమ్మకం లేక హైదరాబాద్ పారిపోయిన విజయ సాయి రెడ్డి మళ్లీ ట్విట్టర్ లో మొరగడం మొదలు పెట్టాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 14 నెలల్లో ఇటుక పెట్టాను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి 3 రాజధానులు నిర్మిస్తాడు అని చెవిలో క్యాబేజీ పువ్వు పెడుతున్నాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

అయితే ఇదే తరహాలో వైసీపీ నేతలు తీరు ను సైతం విమర్శించారు. ఇదంతా చూస్తున్న వైసీపీ నాయకులు మింగలేక కక్కలేక మోహలన్ని కంద గడ్డలా పెట్టుకున్నారు అంటూ విమర్శించారు. అయితే ఒక పక్క కరోనా విలయ తాండవం చేస్తుంటే, మూడు రాజధానుల పై ఆనందం ఒక్క బ్లూ మీడియా లో తప్ప ఎక్కడా కనబడటం లేదు సాయిరెడ్డి గమనించావా అంటూ వ్యాఖ్యానించారు.