మళ్లీ అరెస్ట్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి…అసలు కారణం ఇదే!

Friday, August 7th, 2020, 08:39:17 PM IST

తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరొక సారి అరెస్ట్ అయ్యారు. అతనితో పాటుగాల అతని కుమారుడు అస్మిత్ రెడ్డి సైతం అరెస్ట్ అయ్యారు. అయితే తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో సీఐ దేవేంద్ర కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అట్రాసిటీ కేసు కింద జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు అస్మిత్ రెడ్డి లను అరెస్ట్ చేయడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద మరొకసారి అరెస్ట్ కావడం తో ఆంధ్ర ప్రదేశ్ లో వీరి అరెస్ట్ చర్చంశనీయం అయింది.

అయితే ఇప్పటికే వాహనాల అక్రమ రేజిస్త్రేషన్ లు చేసి వాహనాలు నడుపుతున్న ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ అయ్యారు. గురువారం నాడు బెయిల్ పై తండ్రి, కొడుకులు ఇద్దరూ జైలు నుండి విడుదల కాగా, నేడు మరొకసారి అరెస్ట్ కావడం పట్ల టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుంది. అట్రాసిటీ కేసు కింద అరెస్ట్ కావడం పట్ల ఈసారి బెయిల్ రావడం కష్టం అని కొందరు భావిస్తున్నారు.