సీఎం జగన్ కి మద్దతిస్తున్న టీడీపీ నేత – ఎందుకంటే…?

Thursday, April 2nd, 2020, 11:35:00 AM IST

భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ కారణంగా దేశమంతా కూడా తల్లక్రిందులైపోతుంది. ఈ తరుణంలో దేశ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. కాగా ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తూ, ఈ కరోనాని అడ్డుకోడానికి నిధులను కూడా సమకూర్చుకుంటుంది. అయితే కొందరు ప్రథమ స్థాయి ఉద్యోగుల జీతాలు తమ సహాయనిధికి కి కరోనా నిమిత్తం తీసుకుంటామని, మళ్ళీ పరిస్థితులన్నీ సర్దుకున్నాక వారి జీతాలను వారికి ఇచ్చేస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.

అంతేకాకుండా ఈ అవసరాల నిమిత్తం ప్రస్తుత ఆర్థిక కష్టాలను ఉద్యోగులందరూ కూడా అర్థం చేసుకొని, అందరు కూడా తమ వంతుగా సహకరించాలని చెబుతున్నారు. కానీ ప్రజలందరూ కూడా ఈ భయంకరమైన కరోనా వైరస్ కారణంగా తీవ్రమైన భయాందోళనకు గురవుతున్న తరుణంలో సీఎం జగన్ చేసిన వాఖ్యలపై కొద్దిగా విమర్శలు కూడా చేశారు టీడీపీ నేత రామకృష్ణుడు… ఇకపోతే ఈ కరోనా ని అడ్డుకోవడానికి సీఎం జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో చెప్పలేకపోతున్నారని, ఎదో మొక్కుబడిగా పేరుకు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు వెల్లడించారు.