మీ భూమి త్యాగం చేస్తారా.. మంత్రి కొడాలికి టీడీపీ నేత సవాల్..!

Friday, September 11th, 2020, 08:30:57 AM IST

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఓ పక్క రాజధాని గ్రామాల రైతులు నిరసనలు తెలుపుతుంటే మరో పక్క మంత్రి కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అమరావతిని శాసన రాజధానిగా కూడా చేయకూడదని, రాజధాని నిర్మాణానికి రైతులు త్యాగం చేసిన పొలాలను సెంటు లెక్కన పంచాలని అంటున్నారు.

అయితే కొడాలి నాని వ్యాఖ్యలపై గుడివాడ నియోజకవర్గ టీడీపీ సీనియర్‌ నాయకుడు దింట్యాల రాంబాబు సీరియస్ అయ్యారు. రైతులు త్యాగం చేసిన పొలాలను సెంటు లెక్కన పంచాలని అనడం కాదని తన సొంత పొలం, స్థలాలను పేదలకు పంచి మాట్లాడాలని కొడాలి నానికి సవాల్ విసిరారు. రాజకీయాలలో 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబునాయుడుని విమర్శించే అర్హత బినామీ పేర్లతో ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న మంత్రి కొడాలి నానికి లేదని అన్నారు. రాష్ట్రానికి మంత్రి అన్న విషయం మరచిపోయి ఇతరులపై బూతులు తిట్టడం చూస్తుంటే కొడాలి నానికి మతి చలించిందేమోనని అన్నారు.