నేను రెడీ, నువ్వు రెడీనా.. మంత్రి కన్నబాబుకు టీడీపీ నేత ప్రతిసవాల్..!

Thursday, December 24th, 2020, 07:02:19 AM IST

ఏపీలో ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్రమైన సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ నేత పట్టాభి రామ్‌కు మంత్రి కన్నబాబు సవాల్ విసిరారు. అయితే నేడు మీడియాతో మాట్లాడుతూ ఈ సవాల్‌ను స్వీకరించిన టీడీపీ నేత పట్టాభి మంత్రి కన్న బాబుకు ప్రతి సవాల్ విసిరారు. నాగిని రికార్డింగ్ డ్యాన్స్‌లో బిజీగా ఉన్న కన్నబాబుకు రైతు సమస్యలపై చర్చించేంత ఖాళీ ఉందా అని ప్రశ్నించారు.

అయితే రోజుకో పార్టీ మారి, ఏ ఎండకి ఆ గొడుగు పడుతారంటూ కన్నబాబుపై పట్టాభి విమర్శలు గుప్పించారు. అలాంటి కన్నబాబు చర్చకు రావాలంటూ సవాల్ విసరడం విడ్డూరంగా ఉందని, అసలు రైతులకు ఏ ప్రభుత్వం ఏం చేసిందో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని పట్టాభి చెప్పుకొచ్చాడు. సమయం, వేదిక కన్నబాబు ఫిక్స్ చేయాలని, అదే పనిలో జగన్‌ది జైలు పార్టీ అన్న వ్యాఖ్యలపైనా కూడా తేల్చేసుకుందాం రెడీనా అంటూ మంత్రి కన్నబాబుకు పట్టాభి స్ట్రాంగ్ చాలెంజ్ విసిరారు.