మీ పిరికిపంద చర్యలకు భయపడే వ్యక్తిని కాదు నేను – పట్టాభి రామ్

Sunday, October 4th, 2020, 03:51:31 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పలు చోట్ల తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతల పై పలు రకాల దాడులను చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలుగు దేశం పార్టీ కి చెందిన పట్టాభి రామ్ కార్ ను ధ్వంసం చేశారు పలువురు దుండగులు. అయితే దీనికి కారణం అధికార పార్టీ అంటూ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే తన కారు పై దాడి జరగడం పట్ల పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

జరుగుతున్న అవినీతిని మరియు అక్రమాలను ప్రజల పక్షాన నిలదీస్తున్నందుకు ఇలాంటి దాడి జరిగిందని అంటున్నారు. గతంలో 108 కుంభకోణం, అలానే సరస్వతి ఇండస్ట్రీస్ లో జరిగినా అవినీతి గతంలో బయట పెట్టా అని, ప్రజల పక్షాన మాట్లాడుతూనే ఉన్నా అని తెలిపారు. ఇలా చేస్తున్నందుకు మీరిచ్చిన బహుమానం ఇదేనా అంటూ రాష్ట్ర ప్రభుత్వం ను సూటిగా ప్రశ్నించారు. విశాఖ లో సబ్బం హరికి జరిగిన అంశం పై విమర్శలు చేశారు.

అయితే కొంతమంది పిరికి పందల్ని, దద్దమ్మల్ని ఇంటికి పంపి దాడి చేయించినంత మాత్రాన, తను మౌనంగా ఉండబోను అని, జగన్ మోహన్ రెడ్డి గారు కి ఒకటే చెప్తున్నా అని, మీ పిరికిపంద చర్యలక భయపడే వ్యక్తిని కాదు అని, నీతి గా, నిజాయితీ గా బతుకుతున్న వ్యక్తి నీ అని తెలిపారు. ఇటువంటి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు అని, మీకు దమ్ము ధైర్యం ఉంటే, ప్రజల పక్షాన మేము అడుగుతున్న సమస్యలకు సమాధానం చెప్పండి అంటూ సూటిగా ప్రశ్నించారు.