టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్..!

Wednesday, May 5th, 2021, 11:20:11 PM IST

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. సంగం డెయిరీలో అవకతవకలకు పాల్పడ్డారన్న కేసులో ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్నారు. అయితే స్వల్ఫ కరోనా లక్షణాలు ఆయనలో కనిపించడంతో కరోనా టెస్ట్ చేయించగా పాజిటివ్ అని తేలింది.

అయితే జ్వరం, జలుబు లక్షణాలతో ఆయన ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో ఆరోగ్య పరిస్థితులపై కుటుంబ సభ్యులు, ఆయన తరపు లాయర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ధూళిపాళ్లకు ప్రైవేట్ ఆసుపత్రిలో టెస్టులు చేయించి, చికిత్స అందించాలని పోలీసులు, జైలు అధికారులను ఆదేశించింది. దీంతో నరేంద్రను రాజమండ్రి జైలు నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తరలించనున్నారు. ఇదిలా ఉంటే ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణకు కూడా కరోనా సోకగా ఆయన కూడా ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.