అవినీతిని ప్రశ్నిస్తే దాడి చేస్తారా…వైసీపీ పై దేవినేని ఉమా ఆగ్రహం!

Tuesday, September 1st, 2020, 02:19:47 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార పార్టీ చర్యల పై తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు వరుస ప్రశ్నలు వేస్తున్నారు. వైసీపీ తీరు ప్సు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. అవినీతిని ప్రశ్నిస్తే దాడి చేస్తారా అంటూ తెలుగు దేశం పార్టీ కి చెందిన నేత దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. మైలవరం లో కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ ను ప్రశ్నించిన తెలుగు దేశం పార్టీ కి చెందిన నేత పట్టాభి రామ్ ఆధ్వర్యం లో బృందం, సజ్జా అజయ్ ల పై వైసీపీ నేతల దాడు దుర్మార్గ చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతల పై జరుగుతున్న దాడి పట్ల దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు, దౌర్జన్యాలతో మీ అక్రమాలను కప్పి పుచ్చాలని అనుకుంటున్నారా అని సూటిగా ప్రశ్నించారు. వారి పై ఏం చర్యలు తీసుకుంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ నిలదీశారు. దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.