పేదల పై ఎందుకు భారం మోపుతున్నారు జగన్?

Monday, November 23rd, 2020, 05:52:27 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మరొకసారి తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఘాటు విమర్శలు చేశారు. కరోనా కష్టకాలం లో ప్రజల పై రేషన్ బాదుడు, కిలో కందిపప్పు 67 రూపాయలకు పెంపు, ఇప్పటికే పంచదార పై 14 రూపాయల పెంపు, ఏటా పేదల పై 600 కోట్ల రూపాయల భారం అంటూ దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. అయితే రేషన్ సరుకుల పై తెలుగు దేశం పార్టీ హయం లో 50 శాతం సబ్సిడీ ఉండగా, ఇప్పుడు 25 శాతం కి తగ్గింపు అయింది అని పేర్కొన్నారు. త్వరలో మరింత భారం మోపేందుకు ప్రణాళికలు, ఉపాధి లేక అల్లాడుతున్న పేదల పై ఎందుకు భారం మోపుతున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు అంటూ సూటిగా ప్రశ్నించారు.

ఇప్పటికే సీఎం జగన్ పాలనా విధానం పై టీడీపీ నేతలు వరుస విమర్శలు చేస్తున్న క్రమం లో మరొకసారి దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.