మాట తప్పింది మడమ తిప్పింది మీరే కదా జగన్

Friday, August 7th, 2020, 03:00:41 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో రాజధాని అంశం పై తెలుగు దేశం పార్టీ మరియు అధికార పార్టీ లకు చెందిన నేతలు, ఎమ్మెల్యే లు, ఎంపీ లు ఒకరి పై మరొకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే తెలుగు దేశం పార్టీ గత ప్రభుత్వ పాలనలో అమరావతి ను రాజధాని గా ఎన్నుకోగా, అపుడు ప్రతి పక్ష పార్టీ హోదా కలిగిన వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అమరావతి కి అంగీకారం తెలిపారు. అంతేకాక రాజధాని కోసం 30 వేల ఎకరాల భూమి అవసరం అని కూడా వ్యాఖ్యానించారు.

అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి గతంలో , ఇపుడు చెబుతున్న వ్యాఖ్యల పట్ల తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ తీరు పై టీడీపీ నేత దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలి, నీళ్ళు, ప్రయాణ సౌకర్యం ఉండాలి, విజయవాడ దగ్గరలో 39 వేల ఎకరాలు తీసుకోండి అన్నారు, మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రజా రాజధాని అమరావతి ఇదే కదా అంటూ సూటిగా జగన్ మోహన్ రెడ్డి గారి ను ప్రశ్నించారు. ప్రజా పోరాటం, న్యాయ పోరాటం కొనసాగిస్తోంది టీడీపీ పార్టీ అని, మాట తప్పింది మడమ తిప్పింది మీరే కదా జగన్ మోహన్ రెడ్డి గారు అంటూ దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు.