తప్పుడు ప్రచారాల వైసీపీ – దేవినేని ఉమా

Saturday, September 19th, 2020, 06:57:33 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రాజెక్టుల, కార్యక్రమాల విషయం లో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది అంటూ తెలుగు దేశం పార్టీ నేతలు అంటున్నారు. మరొకసారి టీడీపీ నేత దేవినేని ఉమా అధికార పార్టీ తీరు పై ఘాటు విమర్శలు చేస్తున్నారు.

తప్పుడు ప్రచారాల వైసీపీ అంటూ దేవినేని ఉమా చేసినటువంటి పోస్ట్ సోషల్ మీడియా లో కాస్త వైరల్ గా మారింది. అయితే పట్టిసీమ నిర్మాణం లో ఎటువంటి అవినీతి జరగలేదు అని, ప్రధానికి కేంద్ర జల శక్తి ఇచ్చిన నివేదిక అంటూ ఒకటి ఉంటే, ప్రచారం మాత్రం,పట్టిసీమ లో అక్రమాలు అంటూ చేస్తున్నారు అని దేవినేని ఉమా వ్యాఖ్యానించారు.

గత టీడీపీ ప్రభుత్వం భారీ అవినీతి చేసింది అంటూ వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నా, అధికారం చేపట్టిన అనంతరం నుండి ఒక్క రూపాయి కూడా అవినీతి నిరుపించలేదు అని, కానీ ఆరు లక్షల కోట్ల అవినీతి చేశారు అంటూ ప్రచారం చేస్తున్నారు అని తెలిపారు.

అయితే పోలవరం నిర్మాణ పనుల్లో ఎటువంటి అక్రమాలు జరగలేదు అని, అన్నీ కూడా కేంద్ర నిబంధనలకు లోబడి జరిగాయి అంటూ కేంద్ర జల శక్తి ప్రధానికి నివేదిక ఇవ్వడం వాస్తవం అని, కానీ పోలవరం లో అక్రమాలు అంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది అని తెలిపారు.

టీడీపీ 2014 నుండి 2019 వరకు కూడా 5 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయి అని,వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఒక్క పెట్టుబడి రాలేదు,ఒక్క ఉద్యోగం రాలేదు,పారిశ్రామిక శాఖ మొత్తం అవినీతి మయం అంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు అని దేవినేని ఉమా తెలిపారు. దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.