70 శాతం కి పై గా పోలవరం పనులను టీడీపీ పూర్తి చేసింది – దేవినేని ఉమా

Friday, September 25th, 2020, 02:50:00 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార పార్టీ వైసీపీ తీరు పై తెలుగు దేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో నీ జలవనరుల ప్రాజెక్టు లకి సంబంధించి తమదారి అడ్డదారి అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది అని దేవినేని ఉమా విమర్శించారు. అయితే పోలవరం లో ఎలాంటి అవినీతి జరగలేదు అని, అందుకు కేంద్ర జలవనరుల శాఖ సుప్రీం కోర్టు కి ఇచ్చిన నివేదికలే తమ పారదర్శకత కి నిదర్శనం అని అన్నారు. అయితే 70 శాతానికి పైగా పోలవరం ప్రాజెక్టు పనులను తెలుగు దేశం పార్టీ పూర్తి చేసింది అని మరొకసారి తెలిపారు.

అయితే గత 16 నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఎంతమేరకు పనులు చేపట్టిందో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి అంటూ దేవినేని ఉమా డిమాండ్ చేశారు. అయితే పోలవరం ప్రాజెక్ట్ పనుల పై ఢిల్లీ పెద్దలకు కలిశా అని చెప్పిన సీఎం జగన్, ఆ విషయం పై ఆర్ధిక మంత్రి బుగ్గన ఎందుకు స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే పోలవరం వ్యయం 46 వేల కోట్ల పై చిలుకు అంటూ సొంత మీడియా లో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు అని ఉమా మండిపడ్డారు. వైసీపీ అసమర్థత, అవినీతిని కప్పి పుచ్చుకోవడానికి టీడీపీ పై నిందలు వేస్తున్నారు అంటూ దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.