ఢిల్లీ పర్యటన పదవుల కోసమా…కేసుల మాఫీ కోసమా?

Tuesday, October 6th, 2020, 12:53:15 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన పై ఇంకా వరుస విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మరొకసారి సీఎం జగన్ ఢిల్లీ పర్యటన పై సంచలన ఆరోపణలు చేశారు. అయితే కేంద్ర మంత్రి వర్గం లో పదవుల కోసమే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారు అని దేవినేని ఉమా ఆరోపించారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర మంత్రి పెద్దలతో ఏం చర్చించారొ ఢిల్లీ మీడియా తో చెప్పే దైర్యం ఉందా అని నిలదీశారు.

అయితే కేంద్ర మంత్రి వర్గం లో పదవుల కోసమే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటన పదవుల కోసమా లేకపోతే కేసుల మాఫీ కోసమా అంటూ సీఎం జగన్ పై వరుస ప్రశ్నలు గుప్పించారు.25 మంది ఎంపీ లని ఇస్తే ప్రత్యేక హోదా తీసుకు వస్తామని చెప్పిన సీఎం జగన్, ఇప్పుడు తమ వల్ల కాదు అంటూ చేతులు ఎత్తేశారు అని ఘాటు విమర్శలు చేశారు. అయితే తెలుగు దేశం పార్టీ నేత పట్టాభి కారు పై జరిగిన దాడి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది ఒక పిరికిపంద చర్య అంటూ మండిపడ్డారు. అయితే ప్రభుత్వ అవినీతి ను ప్రశ్నించ డం కారణం గానే దాడి జరిగింది అని ఆరోపించారు, అయితే ఇంటి దొంగను ఈశ్వరుడు అయినా పట్టుకోలేడు అని రీతిలో పోలీసుల తీరు ఉంది అని అన్నారు, సీసీ కెమెరా ల ద్వారా కూడా పట్టుకొలేకపోయారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.