జగన్ కి నోటీసులు ఇవ్వాలి…వర్ల రామయ్య డిమాండ్

Wednesday, January 13th, 2021, 12:05:20 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో దేవాలయాల విగ్రహాల పై వరుస దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దేవాలయాల దాడుల పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలుగు దేశం పార్టీ కీలక నేత, వర్ల రామయ్య స్పందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి 91 సి ఆర్ పిసి కింద నోటీసు ఇవ్వాలని డీజీపీ గౌతం సవాంగ్ కి వర్ల రామయ్య లేఖ రాశారు. అయితే లేఖ తో పాటుగా సీఎం జగన్ మాట్లాడిన వ్యాఖ్యలను ఆధారంగా వీడియోను జత చేశారు.

అమ్మ వడి సభ లో సీఎం జగన్ ఉపన్యాసం ఇస్తూ దేవాలయాల పై దాడులు చేస్తున్న వారు తనకు తెలుసు అని జగన్ సెలవిచ్చారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే డీజీపీ వెంటనే నోటీస్ ఇచ్చి దేవాలయాలు ధ్వంసం చేసింది ఎవరో రాబట్టా లి అంటూ డిమాండ్ చేశారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కి నోటీసులు ఇచ్చిన మీరు ముఖ్యమంత్రి కి ఇవ్వడానికి వెనకడుగు వెయ్యకూడదు అంటూ సూచించారు. చట్టానికి ముఖ్యమంత్రి అతీతులు కాదు అంటూ వర్ల రామయ్య తెలిపారు. అయితే టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.