రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించాలి

Tuesday, December 8th, 2020, 12:40:43 PM IST

దేశ వ్యాప్తంగా రైతులు తలపెట్టిన భారత్ బంద్ విజయవంతం గా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మేరకు దేశ వ్యాప్తంగా రైతులకు, రాజకీయ నాయకులు, ఉద్యోగ, కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. అయితే ఈ మేరకు తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించాలి అని అన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మద్దతు ధర పై చట్టాలు చేయాలి అంటూ చెప్పుకొచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు టీడీపీ సవరణలు సూచించిన విషయాన్ని దేవినేని ఉమా వెల్లడించారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వైసీపీ ప్రభుత్వం తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది అని, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ యార్డ్ లను నిర్వీర్యం చేస్తోంది అని ఆరోపించారు. అయితే రైతులకు మేలు జరగాలి అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ యార్డులను బలోపేతం చేయడం తో పాటుగా, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని సూచించారు. అయితే ఈ కొత్త వ్యవసాయ చట్టాల ద్వారా రైతుల కష్టాన్ని కార్పొరేట్ సంస్థలు దొచుకుంటాయి అని అన్నారు. ఏడు దశాబ్దాల పాటుగా దళారులు రైతుల్ని దోచుకుంటున్నారు అని అన్నారు. అయితే ఈ కొత్త చట్టం ద్వారా దళారుల స్థానంలోకి కార్పొరేట్ సంస్థలు వచ్చి చేరే అవకాశం ఉందని దేవినేని ఉమా ఆరోపించారు.