జగన్ ఇచ్చిన హామీకి తిలోదకాలు వదిలారు

Monday, January 25th, 2021, 01:46:05 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయం లో తెలుగు దేశం పార్టీ కీలక నేత పట్టాభి రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలామంది ఉద్యోగులు రాజ్యాంగానికి లోబడి పంచాయతీ ఎన్నికల నిర్వహణ కి సిద్ధంగా ఉన్నారు అని అన్నారు.అయితే కొందరు బాడుగ నేతలు మాత్రం తాడేపల్లి ప్యాలస్ వైపు ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు.అయితే ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదు అని అన్నారు. అయితే 20 నెలల్లో ఒక్క జీ ఎల్ ఎం అయినా పరిష్కారం అయిందా అంటూ సూటిగా ప్రశ్నించారు.

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఉద్యోగికి జిపి ఎఫ్ నిధులు సక్రమం గా అందడం లేదు అని అన్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగుల పక్షాన టీడీపీ పోరాటం చేస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. అధికారం లోకి వచ్చిన వారం లో సిపీఎస్ రద్దు చేస్తాం అని హామీ ఇచ్చి దానికి తిలోదకాలు వదిలారు అంటూ విమర్శలు చేశారు.