మీ పబ్జీ ప్లేయర్ పై నమ్మకం లేక తెలంగాణ అపోలో కి పరిగెత్తావు – టీడీపీ నేత!

Wednesday, August 5th, 2020, 01:59:33 AM IST


తెలుగు దేశం పార్టీ నేత బుడ్డా వెంకన్న వైసీపీ నేత,ఎంపీ విజయ సాయి రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. “తాడేపల్లి ఇంట్లో పబ్జీ ఆడుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పాలన చూసి బ్రిటన్ ఆరా తీస్తోంది అని అన్నావు, కరోనా నివారణకు చల్లుతున్న మైదా రహస్యం తెలుసుకోవడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ ప్రతి నిధులు వస్తున్నారు అన్నావు, అంతేకాక కరోనా కట్టడిలో దేశంలోనే నంబర్ వన్ అంటూ ప్రకటించుకున్నావు, తీరా నేకు పాజిటివ్ వచ్చే సరికి మీ పబ్జి ప్లేయర్ పై నమ్మకం లేక తెలంగాణ అపోలో కి పరిగెత్తావు” అని ఘాటు విమర్శలు చేశారు.

అయితే తాజాగా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని బుద్దా వెంకన్న ప్రస్తావిస్తూ ప్రజల ఓట్లేసి గెలిచిన సీట్లే 151 అని మీకు నమ్మకం ఉంటే చంద్రబాబు ఛాలెంజ్ స్వీకరించి రాజీనామాలు చేయండి అని అన్నారు. కరోనా తగ్గాకే ఎన్నికలకు వెళ్దాం అను వ్యాఖ్యానించారు. బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చంశనీయమ్ గా మారింది.