నలుగురు ఎమ్మెల్యే లను ఎంతపెట్టి కొన్నారో బయటపెట్టాలి

Friday, October 2nd, 2020, 05:20:00 PM IST

గత ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ 23 స్థానాల్లో గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వైసీపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో భారీ స్థానాల్లో గెలుపొందడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తాజాగా జరుగుతున్న పరిణామాల తో తెలుగు దేశం పార్టీ నేతలు ఇంకా కొంతమంది వైసీపీ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన పలు వ్యాఖ్యలకు గానూ, తెలుగు దేశం పార్టీ కి చెందిన నేత బుద్దా వెంకన్న పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

23 సీట్లు రావడం దేవుడి స్క్రిప్ట్ అనే విజయసాయి రెడ్డి ఇప్పుడు అయిదుగురు ఎమ్మెల్యే లని కొన్నాం అని ప్రకటిస్తున్నారు అంటే, వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచేది 5 సీట్లే అని ఫిక్స్ అయినట్టే అని బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి మాటలు వింటుంటే కరోనా ఎఫెక్ట తో మైండ్ కూడా దెబ్బ తిన్నట్టు కనిపిస్తుంది అని బుద్దా వెంకన్న ఘాటు విమర్శలు చేశారు.

సిద్ధాంతాలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలి అంటున్న వీసా రెడ్డి గారు ఇప్పటి వరకూ రాజీనామా చేయకుండానే చేర్చుకున్న నలుగురు ఎమ్మెల్యే లను ఎంత పెట్టీ కొన్నారో బయటపెట్టాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.