కాసు ఆదేశాలతోనే అంకులు హత్య…సంచలన ఆరోపణలు చేసిన టీడీపీ నేత

Wednesday, January 6th, 2021, 01:56:19 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించిన టీడీపీ నేత అంకులు హత్య పై తెలుగు దేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాసు ఆదేశాలతో నే అంకులు హత్య జరిగింది అని వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ హత్యకి ఎస్ఐ బాల నాగిరెడ్డి సహకారం అందించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ మేరకు పోలీసుల తీరు పై, వైసీపీ నేతల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

హత్య జరిగి మూడు రోజులు అవుతున్నా కేసులో పురోగతి లేదు అని, ఇప్పటికీ ఒక్కరినీ కూడా అరెస్ట్ చేయలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వ్యవస్థను కాపాడాల్సిన పోలీసులే హత్యలు చేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే అంకులు హత్యకి కారకులు అయిన వారిని కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేశారు. కాసు ఎమ్మెల్యే అయ్యాక నలుగురిని హత్య చేయించారు అని, 85 మంది టీడీపీ కార్యకర్తల పై దాడులు చేయించారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే నరసరావు పేట రాజకీయాలు పల్నాడు లో సాగనీయం అని, ఎమ్మెల్యే హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారు అని, హత్యకు గురి అయిన టీడీపీ కార్యకర్తలకు 50 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు.

అయితే ఈ కేసు విషయం లో ఎఫ్ ఐ ఆర్ లో బాల నాగిరెడ్డి పేరు చేర్చాలి అని, లేని యెడల న్యాయ పోరాటం చేస్తాం అని హెచ్చరికలు జారీ చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.