వ్యవసాయ రంగాన్ని వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తోంది – టీడీపీ నేత

Friday, September 4th, 2020, 04:50:12 PM IST

Alapati-Raja

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార పార్టీ వైసీపీ కి మరియు టీడీపీ పార్టీ ల మధ్య ఒకరి పై మరొకరు ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత టీడీపీ ప్రభుత్వం హయం లో చంద్రబాబు నాయుడు రైతులను పట్టించుకోలేదు అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు తెలుగు దేశం పార్టీ కి చెందిన పలువురు నేతలు గట్టిగానే స్పందిస్తున్నారు.

తెలుగు దేశం పార్టీ కి చెందిన ఆలపాటి రాజా వైసీపీ ప్రభుత్వం వైఖరి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వ్యవసాయ రంగాన్ని వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తోంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రుణాలు అందడం లేదు అని, పంటలు కొనేవారు కరువు అయ్యారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీ పార్టీ కి చెందిన ఎమ్మెల్యేలు దళారులు గా మారి, రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. మూలిగే నక్క పై తాటికాయ పడ్డట్లు పంపు సెట్లకు మీటర్ల పేరుతో ఉచిత విద్యుత్ పథకానికి గండి కొడుతున్నారు అని ఆరోపించారు. అయితే ఆలపాటి రాజ చేసిన వ్యాఖ్యలు పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.