సీఎం జగన్ చేసిన కంప్లైంట్ కి మీరు అనుకూలమా, వ్యతిరేకమా?

Wednesday, October 14th, 2020, 04:12:32 PM IST

తెలుగు దేశం పార్టీ నేతలు అధికార పార్టీ తీరు పై వరుస విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే సీఎం జగన్ తీరు తో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు, మరోమారు వరుస ప్రశ్నలు వేస్తున్నారు. ఈ నేపధ్యంలో బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి జడ్జి ల పై కంప్లైంట్ పెట్టిన రోజు నుండి విజయసాయి రెడీ మైకు ముందుకి రావడం లేదు అంటూ బుద్దా వెంకన్న సెటైర్స్ వేశారు. ఏం జరిగినా జై జగన్ అని ట్విట్టర్ లో కూత పెట్టే పక్షి మౌన వ్రతం పాటిస్తుంది అని విమర్శించారు. చిట్టి గుండె, చిన్న మెదడు భయంతో వణుకుతున్నాయా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన కంప్లైంట్ కి విజయసాయి రెడ్డి అనుకూలమా, వ్యతిరేకమా నోరు తెరిచి చెప్పండి అంటూ బుద్దా వెంకన్న ఘాటు విమర్శలు చేశారు. విజయసాయి రెడ్డి చేస్తున్న విమర్శలకు బుద్దా వెంకన్న మరొకసారి గట్టి కౌంటర్ ఇచ్చారు.