ఎంపీ విజయసాయి రెడ్డి పై టీడీపీ నేత సెటైర్స్

Saturday, October 17th, 2020, 11:58:36 PM IST


తెలుగు దేశం పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరొకసారి సోషల్ మీడియా వేదికగా వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి పై ఘాటు విమర్శలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జడ్జీల పై రాసిన కంప్లైంట్ తో నాకేం సంబంధం లేదు, అంతా సలహాదారులే చేశారు అని, ఢిల్లీ వాళ్లకు ఫోన్ చేసి చెబుతున్నారు అంట ఎంపీ విజయసాయి రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పడు మనం సలహాలు ఇచ్చే పరిస్తితిలో లేమని బాధ లేక ఇస్తున్న వారిపై మంటా? అంటూ సూటిగా ప్రశ్నించారు.

అయితే మొత్తానికి రాబోయే ప్రమాదం నుండి కాపాడుకొనే మార్గం వెతుక్కునే పనిలో పడినట్లు ఉన్నారు అని బుద్దా వెంకన్న సెటైర్స్ వేశారు. బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు టీడీపీ కి మద్దతు ఇస్తూ వ్యాఖ్యలు చేస్తుండగా, మరి కొందరు మాత్రం టీడీపీ నేతల పై ఘాటు విమర్శలు చేస్తున్నారు.