వాస్తవాలు ఒప్పుకొని మంత్రి జయరాం రాజీనామా చేయాలి – అయ్యన్న పాత్రుడు

Saturday, September 19th, 2020, 02:00:55 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఈ ఎస్ఐ కుంభకోణం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల మంత్రి కొడుకు సైతం ఈ కుంభకోణం లో భాగం అంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే తాజాగా మరొకసారి తెలుగు దేశం పార్టీ కి చెందిన నేత అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎస్ఐ కేసులో ఉన్న నిందితుడి నుండి కార్మికశాఖ మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్ బెంజ్ కారును లంచం గా తీసుకున్నారు అని, అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయి అంటూ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే జులై 26 నుండి ఈశ్వర్ అదే బెంజ్ కారును ఉపయోగిస్తున్నారు అని, ఆ కారు తీసుకున్నట్లు సోషల్ మీడియా లో కూడా పెట్టుకున్నారు అని తెలిపారు.ఇందుకు సంబంధించిన ఆధారాలు అవసరమైనప్పుడు వెల్లడిస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటికైనా వాస్తవాలను ఒప్పుకొని నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి జయరాం రాజీనామా చేయాలి అంటూ అయ్యన్న పాత్రుడు సంచలన చేశారు.

మంత్రి జయరాం ను సీఎం జగన్ కాపాడుకుంటూ వస్తున్నారు అని, ఫోటోలతో ఆధారాలను చూపించినా, విచారణకు ఆదేశించకుండా ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుంది అంటూ నిలదీశారు. అయితే అవినీతి నిరోధక శాఖ కి ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు, కానీ తను ఫిర్యాదు చేసి 24 గంటలు దాటిన మెసేజ్ రాలేదు అని అన్నారు. ఒక మాజీ మంత్రి చేస్తేనే స్పందించలేదు, అలాంటిది ఇక సామాన్యుల పరిస్తితి ఎంటి అంటూ రాష్ట్ర ప్రభుత్వం ను సూటిగా ప్రశ్నించారు. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చంసమీయం గా మారాయి. వీటి పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.