చంద్రబాబు ముందు నాని ఒక బాతుబచ్చా – టీడీపీ నేత

Thursday, September 10th, 2020, 11:07:31 PM IST


వైసీపీ నేత, మంత్రి కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యల పట్ల తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో టీడీపీ మహిళా నేత దివ్యవాణి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అర్దరాత్రి రోడ్ల పై తిరిగే ఆడవాళ్ళతో తన ఫోటో లను దహనం చేయించారు అంటూ కొడాలి నని చేసిన వ్యాఖ్యలకు ఆమె ధీటుగా జవాబు ఇచ్చారు. కొడాలి నాని తన ఇద్దరు కూతుళ్లను కూడా అలానే తిప్పుతున్నారా? అని సూటిగా ప్రశ్నించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కోసం విజయమ్మ, షర్మిల రోడ్ల మీదికి వచ్చారు అను, కానీ వారి గురించి టీడీపీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇంత అసహ్యం గా మాట్లాడలేదు అని తెలిపారు.

అయితే వైసీపీ ప్రభుత్వం అమ్ముతున్నటువంటి ప్రెసిడెంట్ మెడల్ మందు తాగి నోటికి ఏదొస్తే అది మాట్లాడితే మహిళలు చీపుళ్ళతో కొట్టరా అని అన్నారు. చంద్రబాబు నాయుడు ముందు నాని ఒక బాతుబచ్చా అని, తన ఫోటోలకు అమరావతి మహిళలు శవయాత్ర చేయడాన్ని చూసిన తర్వాత నాని కి ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అయిపోయింది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నానికి ఎవరిని చూసినా పందులు, కుక్కలే గుర్తు కొస్తున్నాయి అని, వైఎస్ హయాంలో రోజా, విడదల రజినీ లు ఎలాంటి విమర్శలు, కామెంట్స్ చేశారో వెనక్కి వెళ్లి చూసుకోవాలి అని సూచించారు. అమరావతి రైతులకు, ప్రజలకు చిచ్చు పెట్టీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పబ్బం గడుపుకోడానికి ప్రయత్నిస్తుంది అని దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు.