వేల కోట్ల దోపిడీ కేనా సోలార్ టెండర్ల పై తొందర?

Monday, December 14th, 2020, 10:50:47 AM IST

Jagan_Uma

తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మరొకసారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోలార్ టెండర్ల విషయం లో మరొకసారి సీఎం జగన్ కి దేవినేని ఉమా సూటిగా ప్రశ్న వేశారు. భారీగా తగ్గిపోతున్న సౌర విద్యుత్ ధరలు, ఇతర రాష్ట్రాల్లో రూ.1.60 లకే యూనిట్, ఇంకా తగ్గుతాయి అంటున్న నిపుణులు అంటూ చెప్పుకొచ్చారు. అయితే వాడుతున్న విద్యుత్ కి రెట్టింపు స్థాయిలో ఇప్పటికే పిపిఎ లు ఉన్నా, రెట్లు తగ్గుతున్న వేళకొనుగోలు ఎందుకు అంటూ దేవినేని ఉమా సూటిగా ప్రశ్నించారు. కమీషన్ల కక్కుర్తి తో వేలకోట్ల దోపిడీ కేనా సోలార్ టెండర్ల పై మీ తొందర అంటూ సీఎం జగన్ ను సూటిగా ప్రశ్నించారు.

అయితే పోలవరం ప్రాజెక్టు విషయం లో కూడా వైసీపీ తీరును ఎండగడుతూ దేవినేని ఉమా మరొకసారి ఘాటు విమర్శలు చేశారు. టీడీపీ హయం లో చంద్రబాబు నాయుడు పోలవరం పనులను 70 శాతం పూర్తి చేస్తే, ఎన్నికల ముందు పునాదులు కూడా లేవలేదు అని తెలిపారు, నిర్వాసితులకు ఇచ్చిన హామీలను అధికారం లోకి వచ్చాక గాలికి వదిలేశారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే 18 నెలల్లో ప్రాజెక్ట్ లో ఎంత శాతం పని జరిగింది అంటూ రాష్ట్ర ప్రభుత్వం ను ప్రశ్నించారు. నిర్వాసితులకు ఏం న్యాయం చేశారు అని, ఎంత ఎత్తులో నీటిని నిల్వ చేస్తారో చెప్పే ధైర్యం లేదా అంటూ వరుస ప్రశ్నలు వేశారు. మరి దీనికి వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.