మంత్రి జయరాం భూ దందాకు పాల్పడ్డారు – అయ్యన్న పాత్రుడు

Tuesday, October 6th, 2020, 04:04:24 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వైసీపీ నేతల పై, ప్రజా ప్రతినిధులపై తెలుగు దేశం పార్టీ నేతలు వరుస విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా మంత్రి జయరాం పై తెలుగు దేశం పార్టీ కీలక నేత అయ్యన్న పాత్రుడు సంచలన ఆరోపణలు చేశారు. కర్నూల్ జిల్లాలో ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన భూములను తప్పుడు పత్రాలు సమర్పించి, తన బందువులు, బినామీ ల పేరిట మంత్రి జయరాం రాయించుకొన్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఆ ప్రైవేట్ సంస్థ నుండి 2009 లో బయటికి వచ్చిన మంజునాథ్ అనే వ్యక్తి తప్పుడు పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలను సమర్పించి వందల ఎకరాల భూమిని తన పేరిట, ఆ తర్వాత మంత్రి బంధువులకు విక్రయించారు అని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు.అయితే ఆ భూమి పై కర్నూల్ జిల్లా కో ఆపరేటివ్ బ్యాంక్ లో రుణం పొందేందుకు యత్నించినట్లు అయ్యన్న పాత్రుడు తెలిపారు.

అయితే కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు చేస్తే కర్ణాటక లో ఒక కేసు కూడా నమోదు అయిన విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ మొత్తం వ్యవహారం కూడా కోర్టు లో ఉంది కదా అంటూ సూటిగా ప్రశ్నించారు. మంత్రి జయరాం భూ దందా కి పాల్పడ్డారు అని, ప్రైవేట్ కంపనీ నుండి భూములు లాక్కున్నట్లు గా ఆధారాలు తన వద్ద ఉన్నాయని అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి దీని పై వైసీపీ నేతలు, మంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి.