మంత్రి గౌతం రెడ్డి అమాయకత్వాన్ని చూసి నవ్వాలో, ఏడవాలో అర్దం కావడం లేదు

Monday, September 7th, 2020, 11:05:46 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు కారణం మేమంటే మేము అంటూ అధికార పార్టీ మరియు తెలుగు దేశం పార్టీ నేతలు ఒకరు పై మరొకరు ఘాటు విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా మంత్రి గౌతం రెడ్డి తెలుగు దేశం పార్టీ నేతల పై ఘాటు విమర్శలు చేశారు. ఇందుకు టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పందించారు. మంత్రి గౌతం రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంత్రి గౌతం రెడ్డి అమాయకత్వాన్ని చూసి నవ్వాలో, ఏడవాలో అర్దం కావడం లేదు అని విమర్శించారు. జగన్ రెడ్డి సంస్కరణ ల వలనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ వచ్చింది అన్న గౌతం కి చిన్న పరీక్ష అని అన్నారు. ఈ ఏడాదిన్నర లో మీ జగన్ గారు తెచ్చిన పాలసీ చూసి రాష్ట్రానికి వచ్చిన ఒక కంపెనీ పేరు చెప్పాలి అని సూటిగా ప్రశ్నించారు. అంతేకాక వైసీపీ పారిశ్రామిక పాలసీ, మేకపాటి గౌతం రెడ్డి గారి కండలు చూసి, క్యూ కట్టిన పారిశ్రామిక వేత్తలు అని బ్లూ మీడియా వార్తలు తప్ప, క్యూ ఎక్కడ ఉందో కనబడటం లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యూ ఎక్కడ ఉందో చెబితే ఎండకి నీరసం రాకుండా మజ్జిగ ప్యాకెట్లు పంచుతాం గౌతం గారూ అంటూ ఎద్దేవా చేశారు.