13 జిల్లాల వెన్నెముకను ప్రభుత్వం విరిచేస్తుంది – యనమల

Sunday, December 13th, 2020, 05:40:58 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజదాని గా అమరావతిని కొనసాగించాలని రైతులు చేస్తున్న పోరాటం చిరస్మరనేయం అని అన్నారు. 13 జిల్లాల ప్రయోజనాల కోసమే రైతులు, మహిళలు పోరాటం చేస్తున్నారు అని తెలిపారు. అయితే ఈ నేపథ్యం లో రైతుల పట్ల జగన్ అనుసరిస్తున్న విధానం పై యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని గ్రామాల్లో వైసీపీ దమన కాండ ను గర్హిస్తున్నాం అని తెలిపారు. 13 జిల్లాల వెన్నెముక ను ప్రభుత్వం విరిచేసింది అంటూ యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే తెలుగు దేశం పార్టీ అధికారం లో ఉండగా చేసిన అభివృద్ధిను వైసీపీ బుగ్గిపాలు చేసింది అంటూ ఆరోపించారు. అంతేకాక అమరావతి కి వచ్చిన 130 కి పైగా సంస్థలను తరిమేశారు అని, దీంతో రాష్ట్రంలోని లక్షలాది మంది యువత ఉపాధఅవకాశాలకు గండి కొట్టారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజదానులతో సీఎం జగన్ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మొండి పట్టు పట్టారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక విశాఖ లో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.