ఇది జగనన్న తొడుకాదు…జగనన్న కబ్జా పథకం

Thursday, November 26th, 2020, 07:42:56 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన జగనన్న తోడు పథకం పై తెలుగు దేశం పార్టీ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఈ మేరకు తెలుగు దేశం పార్టీ కీలక నేత పట్టాభి రామ్ ఈ పథకం గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ చేసేది గోరంత, చెప్పేది కొండత అంటూ సెటైర్స్ వేశారు. ప్రజల ముందు ఇదే విషయాన్ని సీఎం జగన్ పదే పదే చెప్తూ ఉంటారు అని తెలిపారు. అయితే ఇప్పుడు అదే కోవలోకి జగనన్న తోడు పథకం అంటూ పట్టాభి రామ్ విమర్శలు చేశారు.

అయితే ఈ పథకాల ప్రచారం కోసం కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని అన్నారు. అయితే చిరు వ్యాపారుల కోసం, పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ అంటూ ఒక పథకం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో పది వేల రూపాయల వరకు ప్రజలు ఆర్ధిక సహాయం పొందవచ్చు. అయితే రంగులు మార్చి కేంద్ర ప్రభుత్వ పథకాన్ని కబ్జా చేశారు అని చెప్పుకొచ్చారు. ఇది జగనన్న తోడు కాదు, జగనన్న కబ్జా పథకం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వడ్డీ తో సహా తిరిగి చెల్లించాల్సిన అప్పుకి అవసరమా ఇంత హంగామా అంటూ సెటైర్స్ వేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తీరు పట్ల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పట్టాభి రామ్.