ప్రభుత్వం కార్మికుల జీవితాలతో ఆటలు ఆడుకోవద్దు

Thursday, November 12th, 2020, 04:23:32 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై మొదటి నుండి వరుస విమర్శలు చేస్తున్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అయితే మరొకసారి వైసీపీ ప్రభుత్వం ను టార్గెట్ చేస్తూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం కార్మికుల జీవితాలతో ఆటలు ఆడుకొవద్దు అంటూ బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక గా ఒక పోస్ట్ చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానం లో సేవలందిస్తున్న సుమారు 38 వేల మంది పారిశుధ్య కార్మికులకి గత ఏడు నెలలు గా జీతాలు, పది నెలలుగా హెల్త్ ఎలవెన్స లు ఇవ్వటం లేదు అని పేర్కొన్నారు. కార్మికుల జీవన స్థితి అత్యంత దారుణంగా ఉన్నదని పేర్కొన్నారు. అంతేకాక ముఖ్యమంత్రి గారు కార్మికులకు నెలలో 5 వ తేదీన జీతాలు పక్కాగా ఇచ్చేస్తాం అనే మాటను నిలబెట్టుకోవాలీ అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు.