వారికి ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలి – యనమల

Sunday, October 4th, 2020, 09:00:21 PM IST

Yanamala

అధికార పార్టీ తీరు పై తెలుగు దేశం పార్టీ నేత యనమల రామకృష్ణుడు మరొకసారి ఘాటు విమర్శలు చేశారు. కాకినాడ సెజ్ కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, కొత్త బినామీ చట్టం ప్రకారం దర్యాప్తు జరపాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మౌనం వీడాలి అంటూ హితవు పలికారు. ఈ విషయం లో జగన్ కి సంబంధం లేకుంటే రైతులకు ఎందుకు నష్ట పరిహారం ఇప్పించడం లేదు అని సూటిగా ప్రశ్నించారు.

అయితే ఎకరానికి పది వేల రూపాయల చొప్పున, 10 వేల ఎకరాలకు అదనపు పరిహారం 1000 కోట్ల రూపాయలు ఇప్పించాలి అని డిమాండ్ చేశారు. అయితే బల్క్ డ్రగ్ పరిశ్రమ ల ఏర్పాటు పై స్థానికుల వ్యతిరేకత ఉన్ ఉన్నందున ఆ ఆలోచనను విరమించుకోవాలని యనమల రామకృష్ణుడు సూచించారు. దీని వలన కాలుష్య సమస్య తో పాటుగా, మత్స్య కారులు అనేకమంది జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉంది అని తెలిపారు. అయితే జీవనోపాధి కోల్పోయే మత్స్య కారులకి ప్రత్యేక ఆర్ధిక సాయం అందించాలి అని యనమల రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.