ఇంటింటికి రేషన్ బదులు వాక్సిన్ ఇవ్వమని ప్రజలు కోరుతున్నారు – మాజి మంత్రి నక్కా ఆనంద్బాబు

Wednesday, May 12th, 2021, 02:27:32 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది.అయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని మొడటి నుండి టీడీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా తెలుగు దేశం పార్టీ నేత, మాజి మంత్రి నక్కా ఆనందబాబు అధికార పార్టీ వైసీపీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలు అమ్మవడికి బదులుగా, ఆక్సీజన్ ఇవ్వమంటున్నారు అని అన్నారు. వసతి దీవెన వద్దు ఆస్పత్రి లో వసతి కల్పించమంటున్నారు అని వ్యాఖ్యానించారు.

అయితే రేపటికి బతుకుతామనే భరోసా కల్పించమంటున్నారు అని అన్నారు. అంతేకాక ఇంటింటికి రేషన్ బదులు వాక్సిన్ ఇవ్వమని ప్రజలు కోరుతున్నారు అని అన్నారు. అయితే ప్రజల దృష్టిని మరల్చేందుకే చంద్రబాబు పై కేసులు పెడుతున్నారు అంటూ నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ఇతరుల పై నిందలు వేయడం సరికాదు అని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికార పార్టీ వైసీపీ పై టీడీపీ నేతలు వరుస విమర్శలు చేస్తున్నారు.