బ్రేకింగ్ న్యూస్: వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ జగన్ గారు–టీడీపీ నేత సంచలనం

Friday, January 24th, 2020, 12:17:03 PM IST

వైసీపీ నేత విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు గానూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ జగన్ గారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. తండ్రికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీకి పేరు ముందు నాన్న పేరు పెట్టుకున్నాడు అంటూ ఘాటు విమర్శలు చేసారు. నాన్నని ముఖ్యమంత్రి చేసిన సోనియా గాంధీని వెన్నుపోటు పొడిచి తాను సీఎం అవ్వాలని అనుకున్నాడు అంటూ బుద్ధా వెంకన్న ముఖ్యమంత్రి జగన్ ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఇపుడు తన సొంత స్వార్థం కోసం రాజధాని విభజించాలని చూస్తున్నారు అని అన్నారు. ధన బలం, అధికార మదంతో మండలిలోని ప్రజాస్వామ్యాన్ని కూల్చివేయాలని చూసారని సంచలన ఆరోపణలు చేసారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ లను కొనాలని చూశాడని, ఇప్పటికి ఇద్దరినీ కొనేసాడు అన్నట్లుగా వ్యాఖ్యానించారు. మండలి సిబ్బందిని కూడా మేనేజ్ చేసి మేము సెలక్ట్ కమిటీ కి ఇచ్చిన నోటీసు ని పక్కన పెట్టాలని డ్రామా ఆడారని తెలిపారు. మీ దొంగ పనులు గమనించి సెలక్ట్ కమిటీకి బిల్లు పంపితే రౌడీల్లా చైర్మన్ ఫై పడ్డారని విమర్శించారు. 26 రోజులు మండలిలో ఉండి చేసిన చెత్త పనులు సరిపోనట్లు శ్రీరంగ నీతులు చెబుతావా విజయసాయిరెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.