సెలెక్ట్ కమిటీ అంశం ఎందుకు విస్మరించారు – యనమల

Friday, July 31st, 2020, 07:22:12 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ను గవర్నర్ ఆమోదించడం జరిగింది. ఇక పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండనున్నాయి. అయితే పరిపాలన వికేంద్రీకరణ, సిఅర్డిఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం అనేక ప్రశ్నలను రేపుతోంది అని తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. అయితే ఇలా బిల్లులను ఆమోదించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూనే, అటార్నీ జనరల్ అభిప్రాయం కోసం ఆ బిల్లులను ఎందుకు పంపలేదు అని సూటిగా ప్రశ్నించారు.

అయితే శాసన సభ లో మళ్లీ బిల్లులు పెట్టాలని న్యాయ శాఖ సలహా ఇచ్చిన విషయాన్ని మరొకసారి గుర్తు చేశారు యనమల. అయితే అలాంటిది బిల్లులను అక్కడికి పంపి న్యాయ సలహా కోరడం కూడా అనుమానాలకు తావిస్తుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సెలక్ట్ కమిటీ అంశం ఎందుకు విస్మరించారు అంటూ యనమల రామకృష్ణుడు దిమ్మ తిరిగే ప్రశ్న వేశారు. అయితే బిల్లులు ఇంకా కోర్టు లోనే ఉన్నా, ఏజి కూడా చెప్పిన ఎందుకు వినలేదు అంటూ ప్రశ్నించారు. యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు చర్చంశానీయం కాగా, దీనికి వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.