అటువంటి పాలన ఒక్క చంద్రబాబు తోనే సాధ్యం…టీడీపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

Tuesday, September 8th, 2020, 11:15:57 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన అనంతరం నుండి ప్రతి పక్ష పార్టీ నేతలు వరుస విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా మరొకసారి సీఎం జగన్ మోహన్ రెడ్డి పై ట్విట్టర్ వేదికగా తెలుగు దేశం పార్టీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.పదవిలో ఉండటం అంటే అవినీతి చేయడానికో, ప్రతి పక్షాల పై కక్ష సాధించడాని కో అధికారాన్ని దుర్వినియోగం చేయడం కాదు అని బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రణాళిక బద్దంగా పని చేయడం అని, వ్యవస్థలను సంస్కరించడం అని బుద్దా వెంకన్న తెలిపారు. అయితే అటువంటి పాలన ఒక్క చంద్రబాబు తోనే సాధ్యం అని తెలిపారు. ఇది పదే పదే నిరూపితం అవుతున్న సత్యం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. అయితే చంద్రబాబు ఎందుకు ఓడిపోయారు అంటూ సూటిగా ప్రశ్నించారు. మరికొందరు మాత్రం ఇందుకే 23 స్థానాలు ఇచ్చారు అని విమర్శలు చేస్తున్నారు.