ముందు జాగ్రత్తగా రాష్ట్రపతి కాళ్ళ మీద పడ్డాడు – బుద్దా వెంకన్న

Wednesday, September 23rd, 2020, 03:05:07 AM IST


తెలుగు దేశం పార్టీ కీలక నేత బుద్దా వెంకన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి పై, ఎంపీ విజయ సాయి రెడ్డి పై మరొకసారి ఘాటు విమర్శలు చేశారు. బెయిల్ కోసం సోనియా కాళ్ళ మీద పడ్డాడు, లోపలకు వెళ్లకుండా ఉండటానికి మోడీ కాళ్ళ మీద పడ్డాడు, ఎన్నికల్లో డబ్బుల కోసం కేసీఆర్ కాళ్ళ మీద పడ్డాడు, ముందు జాగ్రత్తగా రాష్ట్రపతి కాళ్ళ మీద పడ్డాడు అంటూ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వచ్చిన వార్తలను ఈ వ్యాఖ్యల తో జోడించి మరి బుద్దా వెంకన్న సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

అయితే చేసిన అవినీతి నుండి బయట పడటానికి ఎవరి కాళ్ళు పట్టుకోడానికి అయినా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు సిద్దం అన్న విషయాన్ని మర్చిపోతే ఎలా సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అంటూ ప్రభుత్వ సలహాదారు ను సూటిగా ప్రశ్నించారు. అయితే బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు మరోమారు హాట్ టాపిక్ గా మారాయి. అయితే బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు టీడీపీ కి మద్దతు ఇస్తూ వ్యాఖ్యలు చేస్తుండగా, మరికొందరు మాత్రం జగన్ పై ఘాటు విమర్శలు చేస్తున్నారు.