విజయసాయి రెడ్డికి బుద్దా వెంకన్న దిమ్మ తిరిగే కౌంటర్..!

Wednesday, January 20th, 2021, 06:48:38 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార పార్టీ వైసీపీ కి, ప్రతి పక్ష తెలుగు దేశం పార్టీ కి వరుస గా మాటల యుద్దాలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వరుస గా దేవాలయాల విగ్రహాల పై దాడులు, పలు అంశాల పై అధికార పార్టీ కి, ప్రతి పక్షాలకు మధ్య వరుస మాటల యుద్దాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఎంపీ విజయసాయి రెడ్డి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై చేసిన వ్యాఖ్యలకి తెలుగు దేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి గట్టి కౌంటర్ ఇచ్చారు.

బాత్రూమ్ లో వేసేసిన వాళ్ళే గుండెపోటు అని గగ్గోలు పెడతారు అని అన్నారు. రాష్ట్రాన్ని దోచిన దండుపాళ్యం బ్యాచ్ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని లెక్చర్లు దంచుతారు అంటూ చెప్పుకొచ్చారు. విగ్రహాలు కూల్చమని కాంట్రాక్ట్ ఇచ్చిన కేటుగాళ్లే పంచగట్టి హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నట్లు కటింగ్ ఇస్తారు అంటూ విమర్శలు చేశారు. జగన్ రెడ్డి మార్క్ కన్నింగ్ పాలిటిక్స్ ఇలానే ఉంటాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.