మంత్రి కొడాలి నానిపై తెలుగు యువత నేత సీరియస్ కామెంట్స్..!

Saturday, October 31st, 2020, 02:08:30 AM IST

ఏపీ మంత్రి కొడాలి నానిపై తెలుగు యువత నేత నాదెండ్ల బ్రహ్మం సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, టీడీపీ నేతలు స్పందిస్తూ కొడాలికి దిమ్మతిరిగే కౌంటర్లు కూడా ఇస్తున్నారు.

అయితే తెలుగు యువత నేత నాదెండ్ల బ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ కొడాలి నానికి మంత్రి పదవి ఇవ్వడం మొరటోడి చేతిలో మొగలి పువ్వు పెట్టడం లాంటిదని అన్నారు. నారా లోకేష్ రైతు పరామర్శ యాత్రకి అధికార పార్టీ ఇంతలా ఉలిక్కిపడుతుందంటే ఆయన పోరాట పటిమ ఏమిటో అందరికి అర్ధమవుతుందని అన్నారు. అంతేకాదు తాను ఇస్తానని హామీ ఇచ్చిన సన్నబియ్యానికి, చౌక డిపోలలో ఇస్తున్న దొడ్డు బియ్యానికి తేడా తెలియని మంత్రి కొడాలి నాని అని అన్నారు.