హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించిన బోండా ఉమా!

Thursday, October 15th, 2020, 10:37:55 AM IST

తెలుగు దేశం పార్టీ కీలక నేత బోండా ఉమా హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదిక గా తన పై అసత్యాలను ప్రచారం చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ హీరోయిన్ తో కలిసి హోటల్ నుండి వస్తున్నట్లు పోస్టింగ్స్ చేస్తున్నారు అని తెలిపారు. ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని తెలిపారు. ఈ దుష్ప్రచారం ను అడ్డుకొనేందుకు, వారి పై చర్యలు తీసుకునేందుకు పోలీసులను ఆశ్రయించడం జరిగింది.

అయితే ఆ హీరోయిన్ తో తనకు సంబంధం లేదు అని, తన ఎవరో కూడా తెలియదు అని, ఆరోపణలతో తన పై ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అని ఫిర్యాదు చేశారు. అయితే ఈ సోషల్ మీడియా వేదిక గా దుష్ప్రచారం జరగడం తో బోండా ఉమా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.