టిడిపిలో మగాళ్ళు లేరా.. ఆ విషయం రోజాకు ఎలా తెలుసు..?

Tuesday, April 19th, 2016, 05:37:42 PM IST

uma-roja
తెలుగుదేశం పార్టీకి వైకాపాలోని రోజాకు మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటున్నది. టిడిపిపై రోజా వీలు చిక్కినప్పుడల్లా విరుచుకుపడుతున్నది. ఇక, ఇప్పుడు వైకాపా నుంచి నాయకులు,ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరుతుండటంతో.. వైకాపా ఇబ్బందులు పడుతున్నది. దీనికి తోడు తెలుగుదేశం పార్టీ కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నది. ప్రజా సమస్యల కంటే ఆపరేషన్ ఆకర్ష్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం.. వైకాపా నుంచి వచ్చే వారికీ మంత్రులు ఘనంగా స్వాగతం పలుకుతుండటంతో వైకాపాకు చిర్రెత్తి పోతున్నది.

ఇందులో భాగంగానే రోజా ఇటీవలే తెలుగుదేశం పార్టీపై ఘాటుగా విమర్శలు సందించారు. తెలుగుదేశం పార్టీలో మగాళ్ళు లేరని అందుకే వైకాపా నేతలను తెలుగుదేశం పార్టీలోకి తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక రోజా చేసిన వ్యాఖ్యలకు బొండా ఉమా కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో మగాళ్ళు ఉన్నారో లేరో రోజాకు తెలుసునని.. వైకాపా లో రోజా బాధలు పడలేకే నేతలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని బొండా ఉమా కౌంటర్ ఇచ్చారు. మరి ఈ కౌంటర్ కు రోజా ఎలా స్పందిస్తారో చూడాలి.