భూమా అఖిల ప్రియ అరెస్ట్…ఎందుకంటే?

Wednesday, January 6th, 2021, 12:56:16 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ నేత భూమా అఖిల ప్రియ ను తెలంగాణ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. బోయినపల్లి కిడ్నాప్ కేసు వ్యవహారం లో వీరి పాత్ర ఉన్నట్లు గా పోలీసులు అభిప్రాయం పడుతున్నారు. అయితే భూమా అఖిల ప్రియ ను ఆమె సొంత కారు లోనే పోలీసులు హైదరాబాద్ కి తరలిస్తున్నారు. అయితే ఆమె భర్త భార్గవ్ రామ్ ప్రస్తుతం పరారీ లో ఉన్నట్లు తెలుస్తోంది. భార్గవ్ రామ్ సోదరుడు చంద్రబోస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే భూ వివాదానికి సంబదించి ప్రవీణ్ రావు కుటుంబానికి మరియు అఖిల ప్రియ కుటుంబానికి గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ప్రవీణ్ రావు మరియు ఆయన సోదరులు కిడ్నాప్ సినీ ఫక్కీలో నిన్న రాత్రి జరిగింది. అయితే ఐటీ అధికారులు అంటూ దుండగులు వీరిని బెదిరించి వారితో పాటు ఉన్న ల్యాప్ టాప్ లు, ఫోన్ లను కూడా తీసుకొని పోయారు. అయితే ఈ వ్యవహారం పట్ల భూమా అఖిల ప్రియ అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది.