అలా చెబితే వైసీపీ ఆఫీసు ముందు ఉరేసుకుంటా.. టీడీపీ నేత కీలక వ్యాఖ్యలు..!

Sunday, October 25th, 2020, 03:06:45 AM IST

విశాఖలోని సుదీర్ఘ చరిత్ర ఉన్న గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేతపై వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. గీతం యూనివర్సిటీ యాజమాన్యం 40.51 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నట్టుగా అధికారులు గుర్తించడంతో ఆక్రమణ భూమి ప్రాంతంలో ఉన్న కట్టడాలను తెల్లవారు జామునుంచే కూల్చివేశారు.

అయితే తాజాగా దీనిపై స్పందించిన టీడీపీ నేత బండారు సత్యనారాయణ 18 కేసులు ఉన్న వ్యక్తి సీఎం అవడం తమ కర్మ అని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ పేరు పెట్టిన గీతంను కూల్చడం నిజంగా దౌర్భాగ్యమని అన్నారు. కరోనా సమయంలో గీతం ఆసుపత్రి విశేష సేవలందించిందని అది నిజం కాదని చెప్పమనండి వైసీపీ ఆఫీస్ ముందు ఉరేసుకుంటానని సవాల్ చేశాడు. వైసీపీలో ముగ్గురు ఎమ్మెల్యేలకు ఆక్రమకట్టడాలు ఉన్నాయని, వాటిని కూల్చే దమ్ము జీవీఎంసీ అధికారులకు ఉందా అని ప్రశ్నించారు.