ఏపీలో 139 బీసీ కులాలకుగాను 56 బీసీ కార్పోరేషన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం తాజాగా దీనికి సంబంధించి 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ల పేర్లను ప్రకటించింది. ఇందులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది. అయితే దీనిపై స్పందించిన టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు రాష్ట్రంలో అత్యున్నత పదవులు 800 మంది సొంత సామాజిక వర్గం వారికి ఇచ్చుకున్నారు జగన్ గారని అన్నారు.
అంతేకాదు బీసీ కార్పోరేషన్లు వారికి ఇచ్చే ఛాన్స్ లేక ఆయా కులాల వారిని నియమించి అదేదో బీసీలకు మేలు చేసినట్టు సాక్షికి కోట్లు యాడ్స్ ఇచ్చారని, పనికొచ్చే పదవులు మీవారికి, బీసీ కార్పోరేషన్ నిధులన్నీ మింగేసి ఉత్తుత్తి బీసీ కార్పోరేషన్ల పదవులు వెనుకబడిన తరగతుల వారికిచ్చి, బీసీలు కోలుకోకుండా జగన్ గారు వెన్నుపోటు పొడిచారని అన్నారు.
రాష్ట్రంలో అత్యున్నత పదవులు 800 మంది సొంత సామాజిక వర్గం వారికి ఇచ్చుకున్నారు @ysjagan గారు. బీసీ కార్పొరేషన్లు వారికి ఇచ్చే
చాన్స్ లేక ఆయా కులాల వారిని నియమించి అదేదో బీసీలకు మేలు చేసినట్టు సాక్షికి కోట్లు యాడ్స్ ఇచ్చారు.(1/2)— Ayyanna Patrudu (@AyyannaPatruduC) October 18, 2020