వైసీపీకి కేసులు ముఖ్యం, టీడీపీకి రాష్ట్రం ముఖ్యం.. అయ్యన్న ఇంట్రెస్టింగ్ ట్వీట్..!

Tuesday, September 22nd, 2020, 01:45:28 PM IST

టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ట్విట్టర్ వేదికగా మరోసారి వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళ కాళ్ళ మీద పడటం వైసీపీ చరిత్ర అని అన్నారు. ఆనాడు యూపీఏ ప్రభుత్వం ప్రణబ్‌ను రాష్ట్రపతిగా నియమిస్తే మద్దతు ఇచ్చిందని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాంనాథ్ కోవింద్‌ను పెడితే మద్దతు ఇచ్చిందన్నారు.

అయితే చంచల్ గూడ జైల్ నుంచి బెయిల్ కోసం సోనియా చుట్టూ తిరిగారని, మళ్ళీ లోపలికి పంపకుండా ఎన్డీఏ చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ ఆ రోజు ప్రణబ్‌కు గాని సంగ్మాకు గాని మద్దతు ఇవ్వక తటస్థంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తేడా వస్తే కేంద్రంలో అధికారం కూడా వద్దనుకొని బయటకు వచ్చిందని అన్నారు. వైసీపీకి కేసులు ముఖ్యం. టీడీపీకి రాష్ట్రం ముఖ్యం అని అన్నారు.