విజయసాయి రెడ్డి పై అయ్యన్న పాత్రుడు సంచలన ఆరోపణలు

Friday, August 28th, 2020, 03:00:07 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార పార్టీ వైసీపీ మరియు తెలుగు దేశం పార్టీ లకు చెందిన నేతలు ఒకరు పై మరొకరు ఘాటు విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి పై తెలుగు దేశం పార్టీ నేత అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇళ్ళ స్థలాలు ఇవ్వడం ఎందుకు వాయిదా వేస్తున్నావ్ గన్నేరుపప్పు అని నీ అల్లుడిని అడుగు విజయసాయి రెడ్డి అంటూ ఘాటు విమర్శలు చేశారు. నాలుగు సార్లు వాయిదా వేసి సిగ్గు లేని ఆరోపణలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో పది లక్షల విలువ లేని భూములు 50 లక్షల రూపాయల కి మొని అడ్డంగా బొక్కారు అని సంచలన ఆరోపణలు చేశారు.

పేదల పేరుతో మీరు చేసిన అయిదు వేల కోట్ల రూపాయల స్కాం బయటకు రావడం, పేదలు మీ గన్నేరు పప్పును, నిన్ను రోడ్ల మీద తరిమి కొట్టడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఇళ్ళ స్థలాల పంపిణీ విషయం పై వైసీపీ నేతలు తెలుగు దేశం పార్టీ పై విమర్శలు చేస్తుండగా, తాజాగా అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యల తో మరొకసారి ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. మరి దీని పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.