ప్రైవేట్ టీచర్లను ఆదుకోండి…సీఎం జగన్ కి అచ్చెన్న లేఖ

Thursday, April 22nd, 2021, 03:45:03 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రం లో ప్రైవేట్ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు అని వ్యాఖ్యానించారు. అయితే ఈ కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ఉపాధ్యాయుల బతుకులు దుర్భరంగా మారాయి అని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటి వరకూ 25 మంది ప్రైవేట్ టీచర్లు మృతి చెందినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ విపత్తు సమయం లో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్లు మరియు బోధనేతర సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ డిమాండ్ చేశారు. అంతేకాక ప్రస్తుతం ఒక్కొక్కరికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలి అంటూ చెప్పుకొచ్చారు.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. కరోనా కారణంగా ఉపాధ్యాయులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయులను మరియు బోధనేతర సిబ్బంది ను ఆదుకోవాలి అంటూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలకు అధికార పార్టీ కి చెందిన వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.