రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుంది–అచ్చెన్నాయుడు

Sunday, February 23rd, 2020, 10:29:55 PM IST

వైసీపీ ప్రభుత్వం ఫై అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. తనపై వస్తున్న అసత్య ఆరోపణలు, అవాస్తవాలు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోము అని అన్నారు. ఈఎస్ఐ అక్రమాల్లో తన ప్రమేయం ఉన్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే వాటి ఫై సాక్ష్యాలుంటే నిరభ్యంతరంగా విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చాలని ముఖ్యమంత్రి జగన్ కి సవాల్ విసిరారు. ఈఎస్ఐ ఫై పలు ఆరోపణలు రాగానే అచ్చెన్నాయుడు స్పందించిన విషయం అందరికి తెలిసిందే.

కోటబొమ్మాళి, నిమ్మాడ లో ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. తప్పు చేయాల్సిన అవసరం తనకి లేదని చెప్పిన అచ్చెన్నాయుడు, దస్తాలన్నీ ప్రభుత్వం వద్దనే ఉన్నాయి, విచారణ జరుపుకోవచ్చు అని ఘాటుగా బదులిచ్చారు. ఇష్టానుసారం మాట్లాడి మనోభావాలు దెబ్బతీసినంత మాత్రాన భయపడే కుటుంబం తనది కాదని అన్నారు.